హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య

WGL: వరంగల్ ఎల్‌బీనగర్ తారకరామా వీధికి చెందిన ఆటోడ్రైవర్ సర్వ సుధాకర్ (53) ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు.