హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్కం చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

RR: శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మల్కం చెరువు వద్ద కొనసాగుతున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, రక్షణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.