హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేడు ఐలమ్మ జయంతి వేడుకలు'

ADB: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఆదిలాబాద్ పట్టణంలో శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఉదయం 11గంటలకు రిమ్స్ హాస్పిటల్ ముందున్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం 11:30 గంటలకు ఆర్.ఎస్. గార్డెన్‌లో జయంతి వేడుకల్లో జిల్లా ప్రజలు, బీసీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.