హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాలీబాల్ పోటీలు వాయిదా.!

NLG: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఇవాళ, రేపు జరగాల్సిన అంతర్ కళాశాలల వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలకు వర్షం ఆటంకంగా మారింది. దీంతో పోటీలను వాయిదా వేస్తున్నట్లు మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ మద్దిలేటి శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన ఎంపిక పోటీలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియపరుస్తామన్నారు.