హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్‌పై గణేశ్ శోభాయాత్ర మార్గాల్లో CP తనిఖీలు

HYD: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రధాన మార్గాలను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ బైక్‌పై స్వయంగా పర్యటించి పరిశీలించారు. ఎంజే మార్కెట్, బషీర్ బాగ్, లిబర్టీ ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు.