హైదరాబాద్: 28°C
తెలంగాణ

అథ్లెటిక్స్ పోటీలో విజయం సాధించిన విద్యార్థి

PDPL: పెద్దపల్లి మండలం అప్పన్నపేట జడ్పీహెచ్ఎస్ విద్యార్థి దామ రవితేజ ఎన్టీపీసీలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో షాట్పుట్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. ఈ ప్రతిభతో హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పీడీ సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని హెచ్ఎం అశోక్, ఉపాధ్యాయులు అభినందించారు.