KNR: సైదాపూర్ మండలం రాయికల్ జలపాతాన్ని సందర్శించే పర్యాటకుల భద్రత దృష్ట్యా అటవీశాఖ నిబంధనలు జారీ చేసింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే సందర్శనకు అనుమతి ఉంటుందని హుజూరాబాద్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. బండలు జారే ప్రమాదం ఉండటంతో జలపాతంపైకి ఎక్కరాదని సూచించారు. భారీ వర్షాల సమయంలో ప్రవేశాన్ని నిలిపివేస్తామని తెలిపారు.
తెలంగాణ
రాయికల్ జలపాతానికి వేళలు ఖరారు


