హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనం గొడవలో 8 మందిపై కేసు

KNR: కోర్కల్‌లో వినాయక నిమజ్జనం అనంతరం డీజే సౌండ్ సిస్టం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులకు పాల్పడిన ఘటనపై 8 మందిపై కేసు నమోదు చేసినట్లు వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. శుక్రవారం నిందితులను గుర్తించి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు.