కరీంనగర్‌లోని విద్యుత్ లైన్ల మరమ్మతుల వల్ల శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ టౌన్-2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. 11 కేవీ ఐబీ ఫీడర్ పరిధిలోని ఐబీ చౌరస్తా, సర్కస్ గ్రౌండ్, పద్మనాయక కళ్యాణ మండపం ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలలో అంతరాయం


