హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఏడుపాయలలో పల్లకి సేవ

MDK: ప్రముఖ క్షేత్రం ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయంలో పౌర్ణమి పురస్కరించుకుని శనివారం సాయంత్రం 6 గంటలకు వైభవంగా పల్లకి సేవ చేపట్టనున్నట్లు ఆలయ ఈవో వీరేశం వెల్లడించారు. అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించనున్నట్లు తెలిపారు. భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.