హైదరాబాద్: 28°C
తెలంగాణ

'​బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలి'

SRD: దళిత సమస్యల సాధనకై ఉద్యమిస్తామని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం తెలిపారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ లింకేజీతో సంబంధం లేకుండా దళితులకు రుణ సదుపాయం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.