హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పామాయిల్ ఫ్యాక్టరీకి నీటి కొరత: మేనేజర్

SDPT: నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ నిర్దేశిత లక్ష్యానికి మించి పనిచేస్తోందని మేనేజర్ ప్రణీష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 11 వేల మెట్రిక్ టన్నుల ఎఫ్‌ఎఫ్‌బీ ప్రాసెసింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ నిర్వహణకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, ఎదురవుతున్న నీటి కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన పేర్కొన్నారు.