హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుకాణాల వద్ద వసూళ్లపై వ్యాపారుల ఫిర్యాదు

ATP: అనంతపురం నగరంలోని దుకాణాల వద్ద దసరా సందర్భంగా ఇబ్బందులు, అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నారంటూ ఆర్యవైశ్య వ్యాపారులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కరుణాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యను పరిశీలించి, బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.