హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిగిలింది ఐదు రోజులే.. కోర్సుల్లో చేరారా?

NZB: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల స్టడీ సెంటర్ల ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్ఐఎస్సీతో పాటు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.