హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీ-సర్వే పరిశీలించిన కలెక్టర్

NRPT: ఉట్కూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో సాగుతున్న డిజిటల్ రీ-సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రియాంక శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ రికార్డుల ఆధునీకరణే లక్ష్యంగా మొదటి విడతలో 45 సర్వే నంబర్ల పరిధిలోని 646.39 ఎకరాల్లో ఈ రీ-సర్వే నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. భూధార్ నంబర్ ఆధారంగా శాశ్వత భూ హక్కులు కల్పిస్తామని ఆమె వెల్లడించారు.