హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించాలి'

WGL: గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడిని వెంటనే నియమించాలని జీడబ్ల్యూఎంసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి శుక్రవారం పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం గ్రేటర్ అధ్యక్షులను నియమించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కోరినట్లు తెలిపారు.