హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకుల ఘటనపై MLC విమర్శలు

JN: పాలకుర్తి  బాలికల గురుకుల పాఠశాల ఘటనపై MLC మల్క కొమురయ్య స్పందించారు. 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడం అత్యంత దారుణమని అన్నారు. గురుకులాల్లో కనీస పారిశుద్ధ్యం, భద్రతా ప్రమాణాలు, రాత్రి పర్యవేక్షణ లోపించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శమని మండిపడ్డారు. బాధ్యులైన అధికారులు , సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గురుకులాల్లో వసతులపై, ప్రభుత్వం సమీక్షించాలని కోరారు.