హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలను సందర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

NLG: విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం కొమ్మేపల్లి గిరిజన బాలుర పాఠశాల, కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్, తాగునీరు, విద్యుత్, డార్మిటరీ హాల్ వంటి సమస్యలను పరిష్కరించాలన్నారు.