హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులను మాజీ మంత్రి పరామర్శ

MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ మోతి నగర్‌లో గత రాత్రి గుడిసె తగలబడి సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరామర్శించారు. ఆయన బాధితులకు ధైర్యం చెబుతూ, తమ వంతు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, తక్షణ సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.