హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేజీబీవీలో బాలికలకు చట్టాలపై అవగాహన'

MLG: వెంకటాపూర్‌ మండలం జవహర్‌నగర్‌ కేజీబీవీలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె. చండీశ్వరి దేవి పాల్గొని బాల్యవివాహాలు, పోక్సో, సైబర్‌ నేరాలు, బాల కార్మికుల నిషేధ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయ సేవా అధికారులు, కేజీబీవీ సిబ్బంది, పాల్గొన్నారు.