హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్

NGKL: జిల్లాలో భూముల రీ సర్వే, భూ భారతి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో శుక్రవారం ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో నిర్వహించిన సమీక్షలో మండలాల వారీగా రీ సర్వే పురోగతిని సమీక్షించారు. భూ రికార్డుల్లో పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా రీ సర్వే చేపట్టాలని సూచించారు.