హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచితంగా షుగర్ పరీక్షలు

KMR: బీర్కూర్‌లో ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా 19 మందికి టెస్ట్‌లు చేయగా, 7 మంది బీర్కూర్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ నారాం ప్రవీణ్, లయన్స్ జోన్ చైర్మన్ సితలె రమేష్, సీనియర్ లయన్ హారిగే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.