హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నిరసన.. సీఈసీ దిష్టిబొమ్మ దగ్ధం

MDK: ఓట్ల తొలగింపును నిరసిస్తూ మెదక్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. SIR పేరుతో అర్హుల ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యత వహిస్తూ సీఈసీ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.