హైదరాబాద్: 28°C
తెలంగాణ

పకడ్బందీగా గణేశ్ నిమజ్జనం: ఎస్పీ

MDK: పట్టణంలో గణేశ్ శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్వయంగా పరిశీలించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విద్యుత్ మార్గాల సరిదిద్దడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.