హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: తెలకపల్లి మండలం పుల్జలలో ఆర్టీసీ బస్సును స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పూజ చేసి ప్రారంభించారు. ఈ బస్సు నాగర్ కర్నూల్, మల్కాపూర్, పుల్జల, తాళ్లపల్లి, నడిగడ్డ మీదుగా తెలకపల్లి చేరుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యకు ఎమ్మెల్యే శాశ్వత పరిష్కారం చూపారు.