హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కోవూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: కోవూరు మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం 132 కేవీ NTS వద్ద మరమ్మతుల పనులు జరుగుతున్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని కోవూరు సబ్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారి మధుసూదనరెడ్డి తెలియజేశారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.