హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంక్‌ డ్రైవ్‌కు రూ.10 వేల జరిమానా

సత్యసాయి: పుట్టపర్తిలో మద్యం సేవించి, వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్ ఆదేశాలతో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పట్టుబడిన వ్యక్తిని పుట్టపర్తి ప్రథమ శ్రేణి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా జరిమానా విధించినట్లు సీఐ యువరాజు తెలిపారు. మద్యం సేవించి, వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.