VSP: దసరా, దీపావళి, ఛఠ్ పూజల పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి-బ్రహ్మపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు విశాఖ రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 28 వరకు మొత్తం 9 ట్రిప్పుల పాటు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ స్టేషన్లలో ఆగనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
చర్లపల్లి-బ్రహ్మపూర్ ప్రత్యేక రైళ్లు


