ASR: ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ కించోళ్ల గ్రామంలో రెండేళ్ల క్రితం వాటర్ ట్యాంక్ నిర్మించి, ఇప్పటి వరకూ తాగునీటి కనెక్షన్లను ఇవ్వలేదని గ్రామస్తులు మండిపడ్డారు. జలజీవన్ మిషన్ పథకం కింద గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మించారని తెలిపారు. ఇప్పటి వరకూ ఇళ్లకు తాగునీటి కనెక్షన్లను ఇవ్వకపోవడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాటర్ ట్యాంక్ నిర్మించి రెండేళ్లు.. తాగునీరు లేదు


