హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారుల పనితీరుపై కలెక్టర్‌ సంతృప్తి

VSP: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టిందని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ప్రమాద ప్రాంతాల నుంచి 97 కుటుంబాలకు చెందిన 257 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, 56 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం, ఆహారం అందించారు. సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు జిల్లాలో సగటున 332.7 మి.మీ. వర్షపాతం నమోదైందన్నారు.