MBNR: బాలానగర్ మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు పాలాది శ్రీవాణి వియత్నాం అంతర్జాతీయ అధ్యయన యాత్రకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 32 మంది ఉపాధ్యాయుల బృందంలో ఆమెకు చోటు దక్కింది. అక్టోబర్ 10 నుంచి 17 వరకు జరిగే యాత్రలో విద్యా విధానాలు, బోధనా పద్ధతులను అధ్యయనం చేయనున్నారు. ఆమె ఎంపికపై TPUS నాయకులు శంకర్ పవర్, శ్రీనివాసులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
వియత్నాం అధ్యయన యాత్రకు శ్రీవాణి


