MNCL: అమృత్ 2.0 పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య ఆదేశించారు. నస్పూర్‌లోని ఈఎల్‌ఎస్‌ఆర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అదనపు కార్మికులను సమీకరించి నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలు, వసతి గృహాలకు ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.
తెలంగాణ
'అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలి'


