హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజే సీజ్..కేసు నమోదు

KMR: లింగంపేట్ మండలంలోని పోల్కంపేటలో వినాయక నిమజ్జనం సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన డీజేను పోలీసులు సీజ్ చేశారు. నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, భారీ శబ్దాలతో సౌండ్ సిస్టం నడుపుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వాహనంతో సహా డీజే సామగ్రిని స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు.