NZB: గణేష్ నిమజ్జనం సందర్భంగా నందిపేట్ మండలం ఊమ్మెడ బ్రిడ్జి వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం పర్యవేక్షించారు. గోదావరి నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించారు. గోదావరి నీటిలో నిమజ్జనం చేసే సమయంలో నిర్వాహకులు జాగ్రత్తగా వ్యవహరించాలని అయన సూచించారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన సిపి


