హైదరాబాద్: 28°C
తెలంగాణ

వయోవృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు

GDWL: జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026 ను వైద్య అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌లోని వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కంటి పరీక్షలు, ఎముకల సంబంధిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులను నేడు ఉచితంగా పంపిణీ చేశారు.