హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

BDK: పాల్వంచలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం నుంచి పాల్వంచ వైపు వస్తున్న బైక్‌ మాజీ ఎమ్మెల్యే వనమా ఇంటి ఎదుట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రాజు అనే వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.