E.G: నిడదవోలు నియోజకవర్గంలో భారీ వర్షాలతో ముంపునకు గురైన పంట పొలాలను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం పరిశీలించారు. తీరుగూడెం, ఆంజనేయపురం, కంసాలిపాలెం, రావిమెట్ల, శంకరాపురం, తిమ్మరాజుపాలెం తదితర గ్రామాల్లో సుమారు 370 హెక్టార్లు (926 ఎకరాల) పంట నష్టాన్ని పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులను ఆదుకుంటాం: మంత్రి దుర్గేష్


