NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించాలని MLA చిక్కుడు వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. అచ్చంపేట పట్టణంలోని MLA క్యాంప్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన సమీక్షలో హాస్టళ్ల పరిస్థితిపై చర్చించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
తెలంగాణ
హాస్టల్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: MLA


