హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ కెమెరాలతో నిమజ్జనాలపై నిఘా

HYD: గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లను సీపీ డాక్టర్ ఎం. రమేశ్ PSIOC భవనం నుంచి సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్ పరిస్థితులు, భక్తుల రద్దీ, భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.