హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంతోషిమాత ఆలయంలో లడ్డూ వేలం

SRD: పటాన్‌చెరు పట్టణంలోని ఇక్రీసాట్ ఎదురుగా ఉన్న శ్రీ సంతోషిమాత ఆలయంలో గణనాథుడి లడ్డూ వేలం ఘనంగా నిర్వహించారు. వేలంపాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని లడ్డూను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. చివరకు పార్టీ గ్రామానికి చెందిన ఓ భక్తుడు రూ.56 వేల రూపాయలకు గణనాథుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.