హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జనంపై పటిష్ట నిఘా

MDCL: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సీపీ బి. సుమతి, IPS కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. చెరువుల వద్ద 500 సీసీ కెమెరాలు, ప్రధాన రహదారుల్లో 5 వేల కెమెరాలు, 3 డ్రోన్లతో రియల్ టైమ్ నిఘా కొనసాగుతోంది. భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు.