హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జీవో 134ను వెంటనే రద్దు చేయాలి'

SRPT: రాష్ట్ర ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలోని భూముల సమస్యల పరిష్కారానికి విడుదల చేసిన జీవో 134ను వెంటనే రద్దు చేయాలని బీఆర్‌ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జీవో 134 కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులను వేధించేందుకే తెచ్చినట్లుగా ఉందని విమర్శించారు.