హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకోవాలి'

ASR: జీకేవీధి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం వరి, రాజ్‌మా పంటలను ఏవో సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న, వేరుశనగ, అపరాల్లో నీరు నిల్వలేకుండా బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. వరి పిలకల నుంచి చిరుపొట్ట దశలో ఉన్నందున ముంపు నీరు తొలగించి ఎకరాకు 30కిలోల యూరియా, 15కిలోల పొటాష్ వేయాలన్నారు. తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.