KDP: జిల్లాలో ఇవాళ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బుల వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో పలువురిని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే గతంలో కూడా దాడులు చేసి పలువురిని సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు


