హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు'

KKD: కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలోని పాటిమీద బ్రిడ్జి వద్ద పాడైన ప్రధాన మంచినీటి పైప్‌లైన్‌ను జనసేన మండల ఇన్‌చార్జ్ రావు అక్షయ్ పరిశీలించారు. ఎమ్మార్వో, ఎంపీడీవో అధికారులతో కలిసి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలకు తన సొంత నిధులతో తాత్కాలిక మంచినీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టారు.