RR: మొగలిగిద్దలోని శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయంలో అనంత పద్మనాభ స్వామి చతుర్దశి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎస్.టి.ఎస్. కేశవాచార్యులు, వేద పండితులు శేషాద్రి చార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేపట్టారు. దీపాలు వెలిగించి స్వామివారిని ఆరాధించారు. కార్యక్రమంలో పలువురు దంపతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
వైభవంగా అనంత పద్మనాభ చతుర్దశి


