HYD: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంపై సీపీ సజ్జనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. నిమజ్జన ఏర్పాట్లలో రాత్రింబవళ్లు విధులు నిర్వహించిన ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులను X వేదికగా అభినందించారు. వేడుకలు సజావుగా సాగేందుకు సహకరించిన నగర ప్రజలు, భక్తులు, ఉత్సవ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఖైరతాబాద్ నిమజ్జనంపై సీపీ హర్షం


