హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంధం ముబారక్‌కు భారీగా భక్తులు

RR: కొందుర్గులో సయ్యద్ మంజన్ రహమతుల్లాహి అలైహి గంధం ముబారక్ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మసీదు కమిటీ అధ్యక్షుడు ఫాయుముద్దీన్, అజీమ్ ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నిర్వహించిన ర్యాలీ భక్తి వాతావరణాన్ని ప్రతిబింబించింది. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.