హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీ టైర్ల కింద పడి యువకుడి మృతి

HYD: ఖైరతాబాద్ మెట్రో పిల్లర్ 1167 సమీపంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి డ్యాన్స్ చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టే క్రమంలో ఓ యువకుడు భయంతో లారీపైకి ఎక్కేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో అదుపుతప్పి వాహనం టైర్ల కింద పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో శోభాయాత్రలో విషాదం నెలకొంది.