హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరటి రైతులకు అపార నష్టం

PPM: తుఫాను ప్రభావంతో జియ్యమ్మవలస మండలంలో అరటి, మొక్కజొన్న, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చింతలబెలగాం, సింగనాపురం గ్రామాల్లో ఉద్యానశాఖ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించారు. ఎకరాకు 33 శాతానికి పైగా నష్టం వాటిల్లిన పంటల వివరాలను నమోదు చేసి, ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. రైతులందరూ తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు.